Home

లింగంపల్లిలో 23 కిలోల గంజాయి పట్టివేత

ముంబైకి చెందిన ఇద్దరు అరెస్టు.. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడి లింగంపల్లి: లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 23 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన రహ్మతుల్లా ఖాన్, రషీద్ ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్న సమయంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి మొత్తం 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను తదుపరి విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. గంజాయి అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, సరఫరా మార్గాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

మృతుల కుటుంబాలను పరామర్శ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్

కౌడిపల్లి/నర్సాపూర్: కౌడిపల్లి మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన గౌండ్ల కిషన్ గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. వారి మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు.అనంతరం నర్సాపూర్ పట్టణంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుధాకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు పాషా, రమేష్, ప్రకాష్, లక్ష్మణ్, పర్వతాలు, కిరణ్ తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీకి ఆకుల ఉదయ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు

ఫతేనగర్, సెప్టెంబర్ 17: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా ఫతేనగర్ బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఆకుల ఉదయ్ కుమార్ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నరేంద్ర మోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయనకు మరింత శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. బీజేపీ సిద్ధాంతాలు, పార్టీ బలోపేతం కోసం ఫతేనగర్ డివిజన్‌లో...

గణనాథుడి సన్నిధిలో ఏసీపీ, సీఐల ప్రత్యేక పూజలు

బాలానగర్, సెప్టెంబర్ 16: బాలానగర్ వినాయకనగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఏసీపీ నరేష్‌రెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ సందర్శించారు. మండప నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు విచ్చేసిన వారు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మాట్లాడుతూ.. తమ ఆహ్వానాన్ని స్వీకరించి వినాయక మండపానికి విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఏసీపీ నరేష్‌రెడ్డి, సీఐ ప్రశాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు....

గణనాథుడి సన్నిధిలో ఏసీపీ, సీఐల ప్రత్యేక పూజలు

వినాయక మండపాల్లో గొట్టిముక్కల వెంగళరావు ప్రత్యేక పూజలు బాలానగర్: వినాయక నవరాత్రుల సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్‌లో భక్తిశ్రద్ధలతో పలు వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు ఇందిరానగర్, బాలానగర్ ప్రాంతాల్లోని పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మండపాల నిర్వాహకులు, భక్తులతో మాట్లాడారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా...

వినాయక మండపాల్లో గొట్టిముక్కల వెంగళరావు ప్రత్యేక పూజలు

బాలానగర్: వినాయక నవరాత్రుల సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్‌లో భక్తిశ్రద్ధలతో పలు వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు ఇందిరానగర్, బాలానగర్ ప్రాంతాల్లోని పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మండపాల నిర్వాహకులు, భక్తులతో మాట్లాడారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు గొట్టిముక్కల వెంగళరావుకు స్వాగతం పలికి,...

బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్

భైంసా: కుభీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం బాలిక ఇతర పిల్లలతో కలిసి గణేష్ మండపం సమీపంలో ఆడుకుంటుండగా, నిందితుడు వారిని మాయమాటలతో తన ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఇతర పిల్లలను బయటకు...

వెన్నెలగడ్డ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధి వెన్నెలగడ్డ (వెన్నా చెరువు) వద్ద గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను కోరి భద్రత, పారిశుద్ధ్యం, లైటింగ్, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, నిమజ్జన ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు,నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,శ్రీనివాస్ రావు,సతీష్ చక్రవర్తి,అరవింద్,సతీష్ గౌడ్,ఎశ్వంత్,పాపయ్య దొర,శ్రవణ్ బోస్,శ్రీకాంత్,మహేష్,శివ తదితరులు పాల్గొన్నారు.

అపార్ట్‌మెంట్ సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్(కుత్బుల్లాపూర్ డివిజన్)పరిధి గాయత్రి నగర్ ఫేస్-3 లో బాలాజీ డివైన్ అపార్ట్‌మెంట్ నివాసులు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని తెలియజేయండంతో అక్కడికి వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి అపార్ట్‌మెంట్ ఎదురుగా పారిశుద్ధ్య సమస్య, వెనుక భాగంలో పిల్లల ఆట స్థలానికి స్థలం, అపార్ట్‌మెంట్ పక్కన భద్రత కోసం హైమాస్ట్ లైట్, అపార్ట్‌మెంట్ ముందు వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని నివాసులు కోరడంతో సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి. ఈ కార్యక్రమం లో పుల్లూరి శ్రీనివాస్ రావు,బోయినిపల్లి సాయికృష్ణ,నవీన్,శ్రవణ్,శ్రీనివాస్,భరత్ కుమార్,దయానంద్ రావు,అభిరామ్,రాజశేఖర్ రెడ్డి,కృష్ణా రెడ్డి,ఎశ్వంత్,శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

బాలాజీనగర్: వినాయక చవితి సందర్భంగా బాలాజీనగర్ హౌసింగ్ బోర్డ్ ( ఏపీహెచ్బి) కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అపోలో ఫార్మసీ ఎదురుగా 60 అడుగుల రోడ్డులోని వినాయకుడి గుడి సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల జెశ్వంత్ రావు (దేశాల్) కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశాల్ మిత్రమండలి సభ్యులతో కలిసి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని...

రౌడీషీటర్ అరెస్ట్.. కత్తితో బెదిరించి రూ.20 వేల డిమాండ్.. నాలుగు కత్తులు స్వాధీనం.

* : కత్తితో బెదిరించి రూ.20 వేలు డిమాండ్ చేసిన రౌడీషీటర్‌ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. హసన్‌నగర్ ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సయ్యద్ మహమ్మద్ అలియాస్ చంగో (25) సెంట్రింగ్ కూలీ, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనిపై గతంలో పలు ఆస్తి సంబంధిత, దాడులు, ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 4న రాత్రి 8 గంటల సమయంలో నిందితుడు నూర్ జహాన్ బేగం ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, ఆమె కుమారుడు అబ్దుల్ రెహమాన్ గొంతుపై కత్తి పెట్టి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించడంతో పాటు, అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా కత్తితో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సెప్టెంబర్ 13న ఫిర్యాదు అందడంతో అత్తాపూర్ పోలీసులు క్రైమ్ నంబర్ 997/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 308(4), 329(4), 352, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25(1)(A) కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన 12 గంటల్లోనే అత్తాపూర్ పోలీసులు, రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి నాలుగు కత్తులు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తును అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ ఎ. సీతయ్య పర్యవేక్షణలో ఎస్‌ఐ నిరంజన్ మహమ్మద్ హుస్సేన్ చేపడుతున్నారు.

ఎస్ ఐ ఆర్  ప్రక్రియలో భాగంగా మోడల్ మార్కెట్‌లో తనిఖీ

ఎస్ ఐ ఆర్  ప్రక్రియలో భాగంగా మోడల్ మార్కెట్ ప్రాంతంలో ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారు పర్యటించి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ ఐ ఆర్  ప్రక్రియ అమలు, ఓటర్ల వివరాల పరిశీలన, సంబంధిత అధికారుల పనితీరును పరిశీలిస్తూ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.  ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఎస్ ఐ ఆర్  ప్రక్రియలో భాగంగా మోడల్ మార్కెట్‌లో తనిఖీ

ఎస్ ఐ ఆర్  ప్రక్రియలో భాగంగా మోడల్ మార్కెట్ ప్రాంతంలో ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారు పర్యటించి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ ఐ ఆర్  ప్రక్రియ అమలు, ఓటర్ల వివరాల పరిశీలన, సంబంధిత అధికారుల పనితీరును పరిశీలిస్తూ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.  ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ముద్దం నర్సింహ యాదవ్ గారు

హస్మత్‌పేట్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్‌లో రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు మరియు మార్కెట్ సంపత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్  ముద్దం నర్సింహ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాన్ని భక్తులకు స్వయంగా వడ్డించి, కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో యువత ముందుకు రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు, యువత మరియు తదితరులు పాల్గొన్నారు.

పయ్యావుల నర్సింగ్ యాదవ్ గారికి నివాళులు

కవాడిగూడ నివాసి, అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, కొమురవెల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు  పయ్యావుల ప్రవీణ్ యాదవ్ గారి తండ్రి శ్రీ పయ్యావుల నర్సింగ్ యాదవ్ గారి పార్థివదేహానికి బీఆర్‌ఎస్ పార్టీ సనత్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్  ముద్దం నర్సింహ యాదవ్ గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో దశరథ్ యాదవ్ పాల్గొన్నారు.

కిరణ్ మృతిపై కాంగ్రెస్ నేతల విమర్శలు

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి హైదరాబాద్: హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి   ఔట్సోర్సింగ్ ఉద్యోగి కిరణ్ మృతి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్లలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీలు ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. ఉద్యోగ భద్రత, తక్కువ వేతనాలు, పని ఒత్తిడి వంటి సమస్యలతో ఔట్సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. కిరణ్ మృతి ఘటనను రాజకీయాలకు ఉపయోగించకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలవడంతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చర్చలు ప్రారంభమయ్యాయని, కనీస వేతనాల పెంపు వంటి చర్యలు చేపట్టిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఉద్యోగులకు భద్రత కల్పించడంతో పాటు వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కిరణ్ మృతికి సంబంధించిన కారణాలపై అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు బాధ్యతను ఏ ఒక్క రాజకీయ పార్టీపై నిర్ధారించడం సాధ్యం కాదని, అయితే ఈ ఘటనతో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరోసారి చర్చకు వచ్చాయని వారు పేర్కొన్నారు.

పదోన్నతులపై డీఎస్పీలతో డీజీపీ సమావేశం

కేసులు ఉపసంహరించుకుంటే ప్రమోషన్లకు మార్గం హైదరాబాద్: 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన అధికారులు, 1998 బ్యాచ్‌కు చెందిన కొంతమంది అధికారులు ప్రస్తుతం డీఎస్పీలు, అదనపు ఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసులు, జోనల్ సమస్యలు, ఇతర పరిపాలనా అంశాల కారణంగా వీరి పదోన్నతుల వ్యవహారం ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించారు. సమస్యను సమగ్రంగా పరిశీలించేందుకు ఇటీవల కమిటీని ఏర్పాటు చేశారు. వరంగల్, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్...

మూసాపేట్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన బండి రమేష్ మూసాపేట్: డివిజన్‌లో తూము రజినీకాంత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమాన్ని చక్కగా...

నర్సింహమూర్తికి రూ.1.75 లక్షల CMRF-LOC అందజేత

పేదలకు సీఎం సహాయ నిధి ఆపన్నహస్తం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి: వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన శ్రీ నర్సింహమూర్తికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.1,75,000 విలువైన LOC మంజూరి పత్రాన్ని PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని అన్నారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు...

మైనారిటీ మహిళలకు రూ.50 వేల ఆర్థిక చేయూత

ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన కింద ఐదుగురు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ శేరిలింగంపల్లి: మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకం కింద శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఐదుగురు అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.2.50 లక్షల విలువైన చెక్కులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారుకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, మహిళలు...