Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పదోన్నతులపై డీఎస్పీలతో డీజీపీ సమావేశం

Author
Posted By AKSHARA NETRAM
| 16 Sep 2026, 05:16 PM |
పదోన్నతులపై డీఎస్పీలతో డీజీపీ సమావేశం

కేసులు ఉపసంహరించుకుంటే ప్రమోషన్లకు మార్గం
హైదరాబాద్: 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన అధికారులు, 1998 బ్యాచ్‌కు చెందిన కొంతమంది అధికారులు ప్రస్తుతం డీఎస్పీలు, అదనపు ఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసులు, జోనల్ సమస్యలు, ఇతర పరిపాలనా అంశాల కారణంగా వీరి పదోన్నతుల వ్యవహారం ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది.
ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించారు. సమస్యను సమగ్రంగా పరిశీలించేందుకు ఇటీవల కమిటీని ఏర్పాటు చేశారు. వరంగల్, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ రేంజ్‌లకు చెందిన అధికారులతో డీజీపీ సమావేశమై నిబంధనలు, కమిటీ పరిశీలనలను వివరించారు.
కోర్టు కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అదనపు ఎస్పీ స్థాయిలో 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ తెలిపారు. కేసులు కొనసాగితే పలువురు అధికారులు డీఎస్పీలుగానే పదవీ విరమణ చేసే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వివరించారు.
సీనియారిటీ, నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారికి దశలవారీగా పదోన్నతులు కల్పించేందుకు ప్రయత్నిస్తామని, అధికారులు తమ కేసులను ఉపసంహరించుకుని కమిటీపై నమ్మకంతో ముందుకు రావాలని డీజీపీ సూచించారు.
రోజంతా జరిగిన చర్చల అనంతరం అధికారులు ఒక అవగాహనకు వచ్చారు. తమ అభిప్రాయాలను వారం రోజుల్లోగా తెలియజేయడానికి అంగీకరించారు. కేసుల ఉపసంహరణకు అధికారులు అంగీకరిస్తే పదోన్నతుల ప్రక్రియకు మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది.