Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మైనారిటీ మహిళలకు రూ.50 వేల ఆర్థిక చేయూత

Author
Posted By AKSHARA NETRAM
| 16 Sep 2026, 05:01 PM |
మైనారిటీ మహిళలకు రూ.50 వేల ఆర్థిక చేయూత

ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన కింద ఐదుగురు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
శేరిలింగంపల్లి: మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకం కింద శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఐదుగురు అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.2.50 లక్షల విలువైన చెక్కులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారుకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా స్వశక్తితో ఎదిగేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన ద్వారా మహిళలు చిన్నతరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ ఆర్థిక సహాయంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడంతో పాటు మహిళలు స్వతంత్రంగా ఆదాయం పొందేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
మైనారిటీ మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచి, వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని గాంధీ తెలిపారు.
తుర్క కాశా మైనారిటీలకు జనరేటర్లు, టూల్ కిట్ల పంపిణీ
అదేవిధంగా తుర్క కాశా మైనారిటీ వర్గాలకు స్టోన్ కటింగ్ జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ, రాళ్ల కటింగ్ పనిపై ఆధారపడి జీవించే వారికి జనరేటర్లు, టూల్ కిట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
వీటి ద్వారా పనిలో సమయం ఆదా కావడంతో పాటు శ్రమ తగ్గి, తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకునే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. తద్వారా ఆదాయం పెరిగి వారు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ఈ పరికరాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
రూ.50 వేల ఆర్థిక సహాయం అందుకోవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు ఆర్థికంగా అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పోతుల రాజేందర్, కాశీనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.