Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి — కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

Author
Posted By AKSHARA NETRAM
| 15 Sep 2026, 11:01 PM |
గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి — కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

సికింద్రాబాద్: గణేష్ చతుర్థి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్డు-1 బాపూజీనగర్, వార్డు-6 ఎల్‌ఐసీ కాలనీ, వార్డు-5 వాసవీనగర్, వార్డు-4 పికెట్ ప్రాంతాల్లోని వినాయక మండపాలను ఎమ్మెల్యే శ్రీగణేష్ సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, భక్తులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకోవాలని మండపాల నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
గణనాథుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆకాంక్షించారు.