పదోన్నతులపై డీఎస్పీలతో డీజీపీ సమావేశం
కేసులు ఉపసంహరించుకుంటే ప్రమోషన్లకు మార్గం హైదరాబాద్: 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన అధికారులు, 1998 బ్యాచ్‌కు చెందిన కొంతమంది అధికారులు ప్రస్తుతం డీఎస్పీలు, అదనపు ఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసులు, జోనల్ సమస్యలు, ఇతర పరిపాలనా అంశాల కారణంగా వీరి పదోన్నతుల వ్యవహారం ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించారు. సమస్యను సమగ్రంగా పరిశీలించేందుకు ఇటీవల కమిటీని ఏర్పాటు చేశారు. వరంగల్, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ రేంజ్‌లకు చెందిన అధికారులతో డీజీపీ సమావేశమై నిబంధనలు, కమిటీ పరిశీలనలను వివరించారు. కోర్టు కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అదనపు...