మైనారిటీ మహిళలకు రూ.50 వేల ఆర్థిక చేయూత

ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన కింద ఐదుగురు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ శేరిలింగంపల్లి: మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకం కింద శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఐదుగురు అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.2.50 లక్షల విలువైన చెక్కులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారుకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా స్వశక్తితో ఎదిగేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ...