Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సర్దార్ పటేల్ విగ్రహాలకు పాలాభిషేకం

Author
Posted By AKSHARA NETRAM
| 16 Sep 2026, 04:53 PM |
సర్దార్ పటేల్ విగ్రహాలకు పాలాభిషేకం

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఎమ్మార్వోలకు బీజేపీ నేతల వినతి
కూకట్‌పల్లి: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూకట్‌పల్లి నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వసంత్‌నగర్ డివిజన్ పరిధిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నగర్, మూసాపేట్ డివిజన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్లో ఉన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాలను శుభ్రపరిచి, పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరై విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు.
అనంతరం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కోరుతూ కూకట్‌పల్లి, బాలానగర్ మండల రెవెన్యూ అధికారి కార్యాలయాల్లో స్థానిక ఎమ్మార్వోలకు బీజేపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టమని అన్నారు. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగిన ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయిందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం ద్వారా ఆ చారిత్రక ఘట్టాన్ని భావితరాలకు తెలియజేయవచ్చని అన్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవడంతో పాటు వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ డివిజన్ల నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.