సర్దార్ పటేల్ విగ్రహాలకు పాలాభిషేకం
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఎమ్మార్వోలకు బీజేపీ నేతల వినతి కూకట్పల్లి: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వసంత్‌నగర్ డివిజన్ పరిధిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నగర్, మూసాపేట్ డివిజన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్లో ఉన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాలను శుభ్రపరిచి, పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి...