Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

22-ఏ నిషేధిత జాబితా నుంచి భూములు, ప్లాట్లను తొలగించాలి

Author
Posted By AKSHARA NETRAM
| 16 Sep 2026, 04:48 PM |
22-ఏ నిషేధిత జాబితా నుంచి భూములు, ప్లాట్లను తొలగించాలి

మేడ్చల్-మల్కాజ్‌గిరి కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా
మేడ్చల్-మల్కాజ్‌గిరి: 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములు, గతంలో సేల్ డీడ్‌ల ద్వారా విక్రయించిన ప్లాట్లు, ఇళ్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం (సెప్టెంబర్ 16) మేడ్చల్-మల్కాజ్‌గిరి కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వం, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ, 20 సంవత్సరాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న ఆస్తులను సైతం 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ధర్నాకు పొలిట్‌బ్యూరో సభ్యులు, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బక్కని నరసింహులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ కన్వీనర్ కందికంటి అశోక్ కుమార్ గౌడ్, టీటీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కార్పొరేటర్ కంటెస్టెంట్ రామోజు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.
పట్టా భూములు, గతంలో చట్టబద్ధంగా విక్రయించిన ప్లాట్లు, నివాస గృహాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించి, అర్హమైన ఆస్తులను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు.