22-ఏ నిషేధిత జాబితా నుంచి భూములు, ప్లాట్లను తొలగించాలి
మేడ్చల్-మల్కాజ్గిరి కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా మేడ్చల్-మల్కాజ్గిరి: 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములు, గతంలో సేల్ డీడ్ల ద్వారా విక్రయించిన ప్లాట్లు, ఇళ్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం (సెప్టెంబర్ 16) మేడ్చల్-మల్కాజ్గిరి కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ, 20 సంవత్సరాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న ఆస్తులను సైతం 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ నాయకులు...