Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పగడాల బాబురావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Author
Posted By AKSHARA NETRAM
| 16 Sep 2026, 12:06 AM |
పగడాల బాబురావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్‌పల్లి: బాలాజీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై పగడాల బాబురావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ పగడాల బాబురావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఆయనకు కలగాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని పగడాల బాబురావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.