Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

దేవేందర్ నగర్ కాటమైసమ్మ బస్తీలో రూ.34 లక్షలతో రోడ్డు పనులకు శ్రీకారం

Author
Posted By AKSHARA NETRAM
| 15 Sep 2026, 11:34 PM |
దేవేందర్ నగర్ కాటమైసమ్మ బస్తీలో రూ.34 లక్షలతో రోడ్డు పనులకు శ్రీకారం

కొలను హన్మంత్ రెడ్డి చొరవతో అభివృద్ధి పనులు ప్రారంభం
కుత్బుల్లాపూర్: 277వ డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ కాటమైసమ్మ బస్తీలో రూ.34 లక్షల వ్యయంతో నాలుగు రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కొలను హన్మంత్ రెడ్డి చొరవతో ఈ నూతన రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా 277వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి అభివృద్ధి పనులను సందర్శించి, స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రోడ్డు పనులు పూర్తయితే బస్తీలోని ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు.
దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రహదారి సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి బస్తీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.