Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు కూన శ్రీశైలం గౌడ్ సన్మానం

Author
Posted By AKSHARA NETRAM
| 15 Sep 2026, 11:30 PM |
పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు కూన శ్రీశైలం గౌడ్ సన్మానం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గాంధీభవన్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మహేష్ కుమార్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, అభ్యున్నతికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
పార్టీని ప్రజల్లో మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలకు అండగా నిలవాలని, కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, దీపక్ జాన్ తదితరులు పాల్గొన్నారు.