Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వినాయక మండపాల్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బ్యానర్లు, పోస్టర్ల ఆవిష్కరణ

Author
Posted By AKSHARA NETRAM
| 15 Sep 2026, 11:25 PM |
వినాయక మండపాల్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బ్యానర్లు, పోస్టర్ల ఆవిష్కరణ

కుత్బుల్లాపూర్: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉమ్మడి సుభాష్‌నగర్ డివిజన్ కన్వీనర్ పోల్కం విగ్నేష్, చేనేత జిల్లా అధ్యక్షులు కంది శ్రీరాములు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు వినాయక మండపాల్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బ్యానర్లు, పోస్టర్లను ఆవిష్కరించారు.
మండపాల కమిటీ సభ్యులతో కలిసి బ్యానర్లు, పోస్టర్లను విడుదల చేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఉత్సవ ఏర్పాట్లపై చర్చించారు.
కార్యక్రమంలో సాయిబాబానగర్ డివిజన్-292కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు దేవర రమేష్, వివిధ వినాయక మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.