బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్

భైంసా: కుభీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం బాలిక ఇతర పిల్లలతో కలిసి గణేష్ మండపం సమీపంలో ఆడుకుంటుండగా, నిందితుడు వారిని మాయమాటలతో తన ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఇతర పిల్లలను బయటకు పంపించి, బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కుభీర్...