వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

బాలాజీనగర్: వినాయక చవితి సందర్భంగా బాలాజీనగర్ హౌసింగ్ బోర్డ్ ( ఏపీహెచ్బి) కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అపోలో ఫార్మసీ ఎదురుగా 60 అడుగుల రోడ్డులోని వినాయకుడి గుడి సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల జెశ్వంత్ రావు (దేశాల్) కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశాల్ మిత్రమండలి సభ్యులతో కలిసి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా జెశ్వంత్ రావు మాట్లాడుతూ యువతలో ఐక్యత, సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఇలాంటి...