అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ముద్దం నర్సింహ యాదవ్ గారు

హస్మత్‌పేట్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్‌లో రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు మరియు మార్కెట్ సంపత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్  ముద్దం నర్సింహ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాన్ని భక్తులకు స్వయంగా వడ్డించి, కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో యువత ముందుకు రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు, యువత మరియు తదితరులు పాల్గొన్నారు.