మూసాపేట్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన బండి రమేష్ మూసాపేట్: డివిజన్‌లో తూము రజినీకాంత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ ప్రజలలో భక్తి, ఐక్యత,...