మూసాపేట్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
వినాయకుడి ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన బండి రమేష్ మూసాపేట్: మూసాపేట్ డివిజన్లో తూము రజినీకాంత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదిన వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ ప్రజల్లో భక్తి, ఐక్యత, సోదరభావాన్ని మరింత...