వినాయక మండపాలకు మిరియాల ప్రీతమ్ ఆర్థిక సహాయం

భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచన చందానగర్: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహించేందుకు చందానగర్ పరిధిలోని పలు వినాయక మండపాల నిర్వాహకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేలా నిర్వహించుకోవాలని కోరారు. మండపాల నిర్వాహకులు ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక సహాయం అందించిన మిరియాల ప్రీతమ్‌కు మండపాల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.