రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా’ పాదయాత్ర

కూకట్‌పల్లిలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవీఆర్ కూకట్‌పల్లి: రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన ‘రాగ ఫర్ రైస్ అఫ్ ఇండియా ’ జాతీయ పాదయాత్రకు కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగనున్న ఈ జాతీయ పాదయాత్ర సెప్టెంబర్ 15న ఉదయం 6 గంటలకు గాంధీభవన్ నుంచి ప్రారంభమైంది. కూకట్‌పల్లి నియోజకవర్గానికి చేరుకున్న పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు (జీవీఆర్ ) స్వాగతం పలికి, కాటూరి వెంకటేశ్వర్లును శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జీవీఆర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం,...