పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సికింద్రాబాద్: పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. పికెట్లోని కార్ఖానా, పికెట్, మారేడ్పల్లి ప్రాంతాల్లో 9 రేషన్ షాపుల పరిధిలోని 9,156 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు కీలకమైన పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి...