కులమతాలకు అతీతంగా వినాయక భక్తి
వినాయక మండపంలో ఖలీల్‌ను సన్మానించిన దొడ్ల వెంకటేష్ గౌడ్ కుత్బుల్లాపూర్: వినాయక చవితి శుభసందర్భంగా ఎల్లమ్మబండ వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఎల్లమ్మబండ వినాయక భక్త బృందానికి 21 కిలోల లడ్డును అందిస్తున్న ఎం.డి. ఖలీల్‌ను దొడ్ల వెంకటేష్ గౌడ్ శాలువాతో సన్మానించి అభినందించారు. కులమతాలకు అతీతంగా గణనాథుని లడ్డూ ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం అందిస్తూ మతసామరస్యానికి ప్రతీకగా...