సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

మీ పాయింట్ ఇక్కడ రాయండి... “తెలంగాణ సప్త సంకల్పాలు” అమలు చేయాలి: బీజేపీ దుండిగల్: సెప్టెంబర్ 17ను అధికారికంగా “తెలంగాణ విమోచన దినోత్సవం”గా నిర్వహించడంతో పాటు తెలంగాణ విమోచన చరిత్రను శాశ్వతంగా పరిరక్షించేందుకు “తెలంగాణ సప్త సంకల్పాలు” అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ దుండిగల్ సర్కిల్ ఆధ్వర్యంలో గండిమైసమ్మ–దుండిగల్ మండల డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలు, జమీందారీ–జాగీర్దారీ దోపిడీకి వ్యతిరేకంగా అనేకమంది రైతులు, మహిళలు, యువకులు, సామాన్య ప్రజలు పోరాడి ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు....