మృతుల కుటుంబాలను పరామర్శ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్
కౌడిపల్లి/నర్సాపూర్: కౌడిపల్లి మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన గౌండ్ల కిషన్ గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. వారి మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు.అనంతరం నర్సాపూర్ పట్టణంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుధాకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు పాషా, రమేష్, ప్రకాష్, లక్ష్మణ్, పర్వతాలు, కిరణ్ తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.