🏠 aksharanetram.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 September 2026, 9:42 pm Posted by : AKSHARA NETRAM

గణనాథుడి సన్నిధిలో ఏసీపీ, సీఐల ప్రత్యేక పూజలు

News Image

వినాయక మండపాల్లో గొట్టిముక్కల వెంగళరావు ప్రత్యేక పూజలు

బాలానగర్: వినాయక నవరాత్రుల సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్‌లో భక్తిశ్రద్ధలతో పలు వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు ఇందిరానగర్, బాలానగర్ ప్రాంతాల్లోని పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మండపాల నిర్వాహకులు, భక్తులతో మాట్లాడారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు గొట్టిముక్కల వెంగళరావుకు స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. భక్తులతో కలిసి ఆయన “గణపతి బప్పా మోరియా” అంటూ నినాదాలు చేశారు.
🏠 Home