🏠 aksharanetram.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 September 2026, 8:37 pm Posted by : AKSHARA NETRAM

బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్

News Image


భైంసా: కుభీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం బాలిక ఇతర పిల్లలతో కలిసి గణేష్ మండపం సమీపంలో ఆడుకుంటుండగా, నిందితుడు వారిని మాయమాటలతో తన ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఇతర పిల్లలను బయటకు పంపించి, బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కుభీర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించడంతో పాటు, ఆమె వాంగ్మూలాన్ని చట్ట ప్రకారం నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ, ఎస్సై వెల్లడించారు.
బాలిక వివరాలను గోప్యంగా ఉంచారు.
🏠 Home