🏠 aksharanetram.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 September 2026, 7:01 pm Posted by : AKSHARA NETRAM

వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

News Image



బాలాజీనగర్: వినాయక చవితి సందర్భంగా బాలాజీనగర్ హౌసింగ్ బోర్డ్ ( ఏపీహెచ్బి) కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అపోలో ఫార్మసీ ఎదురుగా 60 అడుగుల రోడ్డులోని వినాయకుడి గుడి సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల జెశ్వంత్ రావు (దేశాల్) కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేశాల్ మిత్రమండలి సభ్యులతో కలిసి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా జెశ్వంత్ రావు మాట్లాడుతూ యువతలో ఐక్యత, సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువతకు అభినందనలు తెలిపారు.
శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
గణపతి బప్పా మోరియా! 🙏
🏠 Home