🏠 aksharanetram.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 September 2026, 4:57 pm Posted by : AKSHARA NETRAM

విద్యుత్ పోల్ సమస్య పరిష్కారానికి చర్యలు

News Image


కాలనీవాసుల వినతిపై స్పందించిన మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
అల్విన్ కాలనీ: ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ను ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ కాలనీ బ్లాక్ నంబర్ 50కు చెందిన కాలనీవాసులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యను వివరించారు.
తమ బిల్డింగ్‌కు విద్యుత్ పోల్ ఆనుకుని ఉండటంతో ఎర్తింగ్ సమస్య ఏర్పడుతోందని, దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ మాజీ కార్పొరేటర్‌కు వినతిపత్రం అందజేశారు.
కాలనీవాసుల సమస్యపై సానుకూలంగా స్పందించిన దొడ్ల వెంకటేష్ గౌడ్ సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, మల్లేష్తో పాటు పీజేఆర్ నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home