ఓటు హక్కును కాపాడుకోవాలి
ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌ఏలతో మందడి శ్రీనివాసరావు సమీక్ష
కేపీహెచ్‌బీ: ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియపై బీఎల్‌ఏలతో కేపీహెచ్‌బీ డివిజన్ మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు బుధవారం తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియలో సక్రమంగా నమోదు జరగక నోటీసులు అందుకున్న ఓటర్లను గుర్తించి, వారి వద్దకు వెళ్లి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సేకరించి ఓటరు నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని బీఎల్‌ఏలకు సూచించారు.
ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడే బాధ్యతను తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజలు కూడా తమ ఓటు వివరాలను పరిశీలించేందుకు కనీసం 15 నిమిషాల సమయం కేటాయించి, ఓటు హక్కుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
సమావేశంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, యర్రా నాగేశ్వరరావు, శ్యామల రాజు, జనరల్ సెక్రటరీ రాజేష్ రాయితో పాటు హనుమంతరావు, రామయ్య, ప్రతాప్, హరిబాబు, శివరెడ్డి, పున్నారావు, రాంబాబు నాయుడు, గఫూర్, మహబూబ్, వలవల నాయుడు, పాతూరి గోపి, దొరబాబు, తులసీరెడ్డి, ఫణి, శౌరీ రాజు, ప్రభాకర్, గంగూరి శ్రీనివాసరావు, దాశరథి, శ్రీనివాసరావు, పెంచల్‌రెడ్డి, త్రినాథ్, భారతి, భవాని, లత, హేమ, సుకన్య, పద్మ తదితర నాయకులు పాల్గొన్నారు.