రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా’ పాదయాత్ర
కూకట్‌పల్లిలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవీఆర్
కూకట్‌పల్లి: రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన ‘రాగ ఫర్ రైస్ అఫ్ ఇండియా ’ జాతీయ పాదయాత్రకు కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగనున్న ఈ జాతీయ పాదయాత్ర సెప్టెంబర్ 15న ఉదయం 6 గంటలకు గాంధీభవన్ నుంచి ప్రారంభమైంది. కూకట్‌పల్లి నియోజకవర్గానికి చేరుకున్న పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు (జీవీఆర్ ) స్వాగతం పలికి, కాటూరి వెంకటేశ్వర్లును శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా జీవీఆర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, దేశ అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన పాదయాత్ర అభినందనీయమన్నారు. దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ఇలాంటి కార్యక్రమాలు మరింత స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన జాతీయ పాదయాత్ర విజయవంతం కావాలని జీవీఆర్ ఆకాంక్షించారు. అనంతరం ఆయనతో కలిసి కూకట్‌పల్లి నుంచి కేపీహెచ్‌బీ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. కేపీహెచ్‌బీలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పాదయాత్రను కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్ అధ్యక్షులు కావేటి నాగార్జున, మాజీ అధ్యక్షులు మేకల రమేష్, కేపీహెచ్‌బీ మాజీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, కృష్ణవేణి, మేకల సుదర్శన్, బచ్చలి రవి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.