🏠 aksharanetram.in
Watermark
Newspaper Logo
Date of Publish : 15 September 2026, 10:52 pm Posted by : AKSHARA NETRAM

అమావాస్య రోజున శ్రీ కాలభైరవ స్వామి దర్శనానికి భక్తుల వెల్లువ

News Image



సుభాష్‌నగర్, పాక్ సాగర్ సమీపం:
సుభాష్‌నగర్‌లోని పాక్ సాగర్ సమీపంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి సాహిత విశ్వేశ్వర దేవాలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఎంతో మహిమగల ఈ ఆలయానికి ప్రతి అమావాస్య రోజున భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అమావాస్య సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభమవుతుంది. స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ కుటుంబాల శ్రేయస్సు, ఆరోగ్యం, సుఖసంతోషాల కోసం ప్రార్థనలు చేస్తారు.
కాలభైరవ స్వామిని శివుని ఉగ్ర స్వరూపంగా, క్షేత్రపాలకుడిగా భక్తులు ఆరాధిస్తారు. కాలభైరవుని దర్శనం, పూజలు చేయడం వల్ల భయాలు తొలగి, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం.
అమావాస్య రోజున ప్రత్యేకంగా నిర్వహించే పూజల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడి, శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుంది.
భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఆలయం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోందని భక్తులు పేర్కొంటున్నారు.
🏠 Home